KA Paul: బండ్ల గ‌ణేష్ ఫోన్ చేసి రేవంత్‌ని సీఎం చేయాలంటున్నారు

Telangana Elections: బండ్ల గ‌ణేష్ (bandla ganesh) త‌న‌కు ఫోన్ చేసి రేవంత్ రెడ్డిని (revanth reddy)  సీఎం చేయాల‌ని రిక్వెస్ట్ చేస్తున్నాడ‌ని తెలిపారు ప్ర‌జా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (ka paul). తెలంగాణ ఎన్నిక‌ల్లో ఆయ‌న పార్టీ 13 నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రేవంత్ రెడ్డి చంద్ర‌బాబు నాయుడు శిష్యుడ‌ని ఆయ‌న్ను సీఎం చేయాల‌ని క‌మ్మ సంఘానికి చెందిన దాదాపు 16 మంది నుంచి ఫోన్ కాల్స్ వ‌చ్చాయ‌ని తెలిపారు.