Chandrababu Naidu: జ్యూడిషియల్ రిమాండ్ పొడగింపు
TDP అధినేత చంద్రబాబు నాయుడుకు (chandrababu naidu) విధించిన జ్యూడిషియల్ రిమాండ్‌ను ఈ నెల 24 వరకు పొడిగించారు. తనను జైలులో ఉంచి క్షోభ పెడుతున్నారని రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై తప్పుడు కేసులు బనాయించారని చంద్రబాబు AP ACB కోర్టుకు వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో AP CID పెట్టిన కేసులో భాగంగా.. AP ACB కోర్టు ఈ నెల 22 వరకు అంటే ఈరోజు వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈరోజు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వెల్లడించాల్సి ఉండగా.. చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్‌ను AP ACB కోర్టు మరో రెండు రోజులు పొడిగించింది.