న‌కిలీ ఓట‌ర్లలో హైద‌రాబాద్ టాప్.. ముఖ్యంగా ఈ రెండు ప్రాంతాల్లోనే

Elections: తెలంగాణ‌లో రాజ‌ధాని హైద‌రాబాద్‌లోనే ఎక్కువ శాతం న‌కిలీ ఓట‌ర్లు ఉన్న‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం బ‌య‌ట‌పెట్టింది. హైద‌రాబాద్‌లోని చంద్రాయ‌ణ‌గుట్ట‌, జూబ్లీ హిల్స్‌లోనే ఎక్కువ న‌కిలీ ఓట్లు ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. హైద‌రాబాద్‌లో 5 ల‌క్ష‌ల న‌కిలీ ఓట్లు ఉండ‌గా.. యావ‌త్ తెలంగాణ‌లో 33 ల‌క్ష‌ల న‌కిలీ ఓట‌ర్ల‌ను తొలగించారు. గ‌త రెండేళ్ల‌లో ఎల‌క్టోర‌ల్ రోల్స్ క్లీన్ అప్ ప్ర‌క్రియ‌లో భాగంగా తెలంగాణ‌లో మొత్తం 32.8 ల‌క్ష‌ల ఓట‌ర్ల‌ను తొల‌గించారు. జూబ్లీ హిల్స్‌లో మొత్తం 60,953 న‌కిలీ ఓట్లు ఉండ‌గా.. చంద్రాయ‌ణ‌గుట్ట‌లో 59,289 యాకుత్‌పురాలో 48,296 న‌కిలీ ఓట్లు ఉన్న‌ట్లు తెలిపారు.

ALSO READ:

AP Elections: ఈ గ్రామంలో రెండు సార్లు ఓటు వేస్తారు.. ఎందుకో తెలుసా?