మీ వల్లే కదా జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో కూర్చున్నాడు
Perni Nani: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్కు సభ్యత్వం ఇవ్వనందుకే అతను రాజకీయాలు వద్దని ఇంట్లో కూర్చోవాల్సి వచ్చిందని అన్నారు పేర్ని నాని. ఇంట్లో వ్యక్తి ఎక్కడ కొడుకుని మించిపోయి రాజకీయాల్లో రాణించేస్తాడో అని సభ్యత్వం ఇవ్వనోడు ఈరోజు జగన్ మోహన్ రెడ్డి కుటుంబాన్ని రోడ్డుకు లాగాలని చూస్తున్నాడని మండిపడ్డారు. కుటుంబంలోని దగ్గుబాటి పురంధేశ్వరి భర్తే స్వయంగా చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎలా వాడుకుంటాడో పుస్తకం రాసి గుడ్డలు ఊడదీసి రోడ్డుపై నిలబెట్టింది మర్చిపోయావా అని నాని సెటైర్ వేసారు. జగన్ ఇంట్లో చిచ్చు పెట్టి అందులో చలిమంట కాచుకోవడం ఈ వయసులో చంద్రబాబుకి మంచిది కాదు అని హెచ్చరించారు.