Israel Hamas War: ఇజ్రాయెల్‌పై స్వ‌రం మార్చిన జో బైడెన్

Israel Hamas War: అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ (joe biden) ఇజ్రాయెల్ గాజాపై చేప‌డుతున్న యుద్ధంపై స్వ‌రం మార్చారు. మొన్న‌టికి మొన్న ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నేత‌న్యాహుని (benjamin netanyahu) క‌లిసి గాజాలోని హ‌మాస్‌పై చేస్తున్న దాడికి మ‌ద్ద‌తు తెలిపిన బైడెన్ ఇప్పుడు ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చారు.

ఇజ్రాయెల్ వెంట‌నే కాల్పుల‌ను విర‌మించుకోవాల‌ని జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన ముసాయిదా బిల్లుకు 153 దేశాల నుంచి మ‌ద్ద‌తు ల‌భించింది. ఈ దేశాల్లో అమెరికా, భార‌త్ కూడా ఉన్నాయి. మొత్తం 193 స‌భ్య దేశాలు ఇందులో ఉండ‌గా వీటిలో 23 దేశాలు ముసాయిదా బిల్లును వ్య‌తిరేకించాయి. అంటే ఇజ్రాయెల్ కాల్పులు విర‌మించుకుంటే మంచిది అని 193 దేశాల్లో 153 దేశాలు అంటున్నాయి. దీనిపై జో బైడెన్ స్పందిస్తూ..బెంజ‌మిన్ నేత‌న్యాహుకు అంత‌ర్జాతీయ మ‌ద్ద‌తు పోతోంద‌ని.. ఇక ఆయ‌నే ఆలోచించి ఓ నిర్ణ‌యం తీసుకుంటే మంచిదని తెలిపారు.

ముసాయిదా బిల్లును తిర‌స్క‌రించిన దేశాలు ఇవే

ఇజ్రాయెల్

ఆస్ట్రియా

చెక‌స్లోవేకియా

గ్వాటెమాలా

లైబీరియా

మైక్రోనేసియా

నౌరూ

ప‌పువా న్యూ గినియా

ప‌రాగ్వే