Joe Biden: యుద్ధంలో పుతిన్ ఓటమి ఖాయం
Joe Biden: ఉక్రెయిన్‌పై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ చేస్తున్న యుద్ధంలో పుతిన్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ విషయంలో అమెరికా ఎప్పటికీ ఉక్రెయిన్‌కే మద్దతు తెలుపుతుందని అన్నారు. రాబోయే మరికొన్ని నెలలు ఉక్రెయిన్‌కు కీలకం అని.. ఈ సమయంలో ఉక్రెయిన్‌కు సాయం చేయాలని బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా, యూకే ప్రభుత్వాలు ఉక్రెయిన్ రష్యాలోని టార్గెట్ ప్రాంతాలపై దాడి చేసేందుకు మిస్సైల్స్ ఇవ్వాలా వద్దే అనే విషయంపై చర్చించుకుంటున్నాయి.
రష్యా దాడుల నుంచి తప్పించుకునేందుకు అమెరికా, బ్రిటన్ దేశాలు US ATACMS, బ్రిటిష్ స్టార్మ్ షాడోస్ వంటి అతిపెద్ద మిస్సైల్స్ ఇస్తే బాగుంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభ్యర్ధించారు. ATACMS మిస్సైల్స్ ఇవ్వడంలో ప్రాబ్లం లేదు కానీ అవి చాలా ఖరీదైన మిస్సైల్స్. పైగా అవి చాలా తక్కువగా ఉన్నాయి. దాంతో అవి ఇవ్వాలా వద్దా అని బ్రిటన్, అమెరికా ఆలోచించుకుంటున్నాయి.