ఆ దాడి మీరు చేయ‌లేదు.. నెత‌న్యాహుకు బైడెన్ బాస‌ట‌

Joe Biden in Israel: అమెరికా (america) అధ్య‌క్షుడు జో బెడెన్ (joe biden) ఇజ్రాయెల్‌లో (israel) ప‌ర్య‌టిస్తున్నారు. గాజాలోని (gaza) అల్ అహిల్ బాప్టిస్ట్ హాస్పిట‌ల్‌పై దాడి జ‌రిగిన నేప‌థ్యంలో బైడెన్.. ఇజ్రాయెల్‌లో ల్యాండ్ అవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నేత‌న్యాహుకు (benjamin netanyahu) బాస‌ట‌గా నిలిచారు. గాజా హాస్పిట‌ల్‌పై దాడి చేసింది మీరంటే మీరు అంటూ ఇజ్రాయెల్ ఆర్మీ.. పాలెస్తీనాలోని ఇస్లామిక్ జిహాద్ దూష‌ణ‌లు చేసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో బైడెన్ నెత‌న్యాహుకి స‌పోర్ట్‌గా నిలుస్తూ.. ఆ దాడి ఇజ్రాయెల్ చేయ‌లేద‌ని నాకు తెలుసు. అది వేరెవ‌రో చేసారు అని ఓదార్చారు.