Joe Biden: అమెరికా అధ్యక్షుడికి తప్పిన ప్రమాదం
Joe Biden: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్లకు ప్రమాదం తప్పింది. నిన్న అమెరికాలోని డెలావర్ ప్రాంతం నుంచి వెళ్తుండగా ఓ సెడాన్ కారు బైడెన్ కాన్వాయ్‌ను ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ బలగాలు ఆయన్ను వేరే కారులోకి ఎక్కించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి చిన్న విషయాలపై కూడా క్షేత్రస్థాయిలో దర్యాప్తులు చేయాల్సి ఉంటుందని ఆయన భద్రతా బలగాలు తెలిపాయి.