Jitta Balakrishna Reddy: BJPకి మాన‌సికంగా దూర‌మ‌య్యా

Hyderabad: త‌న‌కు కాంగ్రెస్ (congress) పార్టీ నుంచి పిలుపు వ‌చ్చింద‌ని అంటున్నారు BJP నేత జిట్టా బాల‌కృష్ణ రెడ్డి (jitta balakrishna reddy). ఏ విష‌యం అన్న‌ది త‌న అనుచ‌రుల‌తో మాట్లాడి నిర్ణ‌యం తీసుకుంటాన‌ని తెలిపారు. మానసికంగా BJPకి దూరమయ్యానని, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయని BJPలో చేరానని అన్నారు. నార్త్ రాష్ట్రాల్లో అబద్ధాలు చెప్తే నమ్ముతారేమో కానీ ఇక్కడ నమ్మరని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని (komatireddy venkat reddy) విమర్శించే స్థాయి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి లేదు అంటూ జిట్టా మండిప‌డ్డారు.