Rahul Gandhi అమెరికా వెళ్తే ఆయ‌న‌లోకి జిన్నా ప్ర‌వేశిస్తాడు

Delhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) విదేశాల‌కు వెళ్తే ఆయ‌న‌లోకి మ‌హమ్మ‌ద్ జిన్నా (jinnah) ప్ర‌వేశిస్తాడంటూ కామెంట్స్ చేసారు BJP నేత ముఖ్త‌ర్ అబ్బాస్ న‌ఖ్వీ (mukhtar abbas naqvi). అమెరికా పర్య‌ట‌న‌లో ఉన్న రాహుల్ గాంధీ.. అక్క‌డి ఎన్నారైల స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ (narendra modi) గురించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. మోదీ అన్నీ త‌న‌కే తెలుసు అనుకంటార‌ని, ఆయ‌న్ను దేవుడి ప‌క్క‌న కూర్చోబెడితే దేవుడికే విశ్వం ఎలా ప‌నిచేస్తుందో వివ‌రిస్తుంటార‌ని అన్నారు. దీనిపై బీజేపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. మోదీ ది బాస్ అంటే రాహుల్ అస్స‌లు ఒప్పుకోర‌ని, ఆయ‌న విదేశాల‌కు వెళ్ల‌గానే ఆయ‌న‌లోకి జిన్నా ప్ర‌వేశిస్తాడ‌ని అన్నారు. రాహుల్ ఇండియాకు వ‌చ్చాక భూత‌వైద్యం చేయించుకుని త‌న‌కు ప‌ట్టిన ఆల్‌ఖైదా, జిన్నా ఆత్మ‌ల‌ను వ‌దిలించుకోవాల‌ని ఎద్దేవాచేసారు. విదేశాల్లో ఇండియా గురించి చీప్‌గా మాట్లాడేందుకు రాహుల్ కాంట్రాక్ట్ తీసుకున్న‌ట్లున్నార‌ని, ఆయ‌న ముస్లింల‌ను చూయింగ్ గ‌మ్‌లా న‌మిలి పారేస్తార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.