BJP: పాత శత్రువు నుంచి స‌పోర్ట్.. ఎందుకో..?

Hyderabad: BJPకి పాత శ‌త్రువు నుంచి తెగ స‌పోర్ట్ వ‌స్తోంది. ఆ శ‌త్రువు ఎవరో కాదు. మొన్న జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఘోరంగా విఫ‌ల‌మైన JDS (జ‌న‌తా ద‌ళ్ సెక్యులర్) పార్టీ. గ‌త శుక్ర‌వారం ఒడిశాలో ఘోర రైలు ప్ర‌మాదం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో BJPని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌ని దాదాపు అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆడిపోసుకున్నాయి. రాజీనామా చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టాయి. కానీ ఒక్క JDS మాత్రం స‌పోర్ట్‌గా నిలిచింది. అదీకాకుండా మొన్న ప్ర‌ధాని నరేంద్ర మోదీ కొత్త‌ పార్ల‌మెంట్‌ను ప్రారంభిస్తున్న‌ప్పుడు దాదాపు 19 పార్టీల వారు వ్య‌తిరేకంగా పోరాడారు.

ఒక్క JDS మాత్రం మోదీకే సపోర్ట్ చేసింది. JDS సీనియ‌ర్ నేత, మాజీ ప్ర‌ధాని దేవె గౌడ (deve gowda) అశ్విని చేతనైనంత చేస్తున్నాడంటూ మ‌ద్ద‌తుగా నిలిచారు. దీనిని బ‌ట్టి చూస్తే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో  (lok sabha elections) JDS BJPతో పొత్తు పెట్టుకుంటుందేమో అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. 2019లో JDS లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో విజయం సాధించింది. దాంతో క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఓడిపోయిన BJP కూడా ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని JDSతో పొత్తుకు పోయే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. 2006లో BJP, JDS క‌లిసి ప‌వ‌ర్ షేరింగ్ ఫార్ములాను ప్ర‌క‌టించాయి. ఆ స‌మ‌యంలో క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా కుమార స్వామి, డిప్యూటీ ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప 20 నెల‌ల పాటు సీటుని పంచుకున్నారు. ఇప్పుడు JDS మ‌ళ్లీ ఇదే సీన్ రిపీట్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.