JD Lakshmi Narayana అరెస్ట్? అసలేం జరిగింది?
JD Lakshmi Narayana: మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేసేందుకు లక్ష్మీ నారాయణ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని (Jagan Mohan Reddy) ముట్టడించేందుకు యత్నించారు. దాంతో తాడేపల్లిగూడెంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
పోరాడదాం ప్రత్యేక హోదా ప్రకటించేంత వరకు, 5 కోట్ల ఆంధ్రుల హక్కు.. ప్రత్యేక హోదా అంటూ జై భారత్ పార్టీ కార్యకర్తలు, నేతలు నినాదాలు చేసారు. లక్ష్మీ నారాయణ CBI జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి క్విడ్ ప్రో కో కేసును డీల్ చేసారు. “”” పది సంవత్సరాలు అయిపోయింది మనకు విభజన చేసి. ఈ పది సంవత్సరాల్లో మనల్ని అందరినీ మోసగించిన ప్రత్యేక హోదాను ఇవ్వలేదు. అన్నీ బ్రహ్మాండమైన అవకాశాలు వచ్చినా కూడా ప్రత్యేక హోదాను తీసుకురావడానికి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం విఫలం అయ్యాయి. (JD Lakshmi Narayana)
ALSO READ: JD Lakshmi Narayana: ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడానికే నా కొత్త పార్టీ
అందుకే మేం ఎప్పుడూ కూడా విఫలాన్ని చూపించడానికి రాలేదు. అందరం కలిసి మళ్లీ ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా అడుగుదాం. రైతులు ఎలా కూర్చున్నారో అలా మనమంతా కూర్చుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొద్దాం. యువతరానికి, భావితరాలకు మనమంతా మార్గదర్శకులం అవుదాం. ఈరోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను అడుగుతున్నా ఇలా ఎన్ని పార్టీలు, విద్యార్ధి నాయకులు అంతా కలిసి ఢిల్లీ వెళ్దామని అంటున్నా కానీ మేమొక్కరిమే వెళ్దాం అని అనడంలేదు. ఈరోజు ఢిల్లీకి వెళ్దామని అడగానికే వచ్చాం. మీకు నోరు లేకపోతే మేం ప్రధాని నరేంద్ర మోదీని అడుగుతాం ప్రత్యేక హోదా కోసం. “””” అని తెలిపారు.
లక్ష్మీ నారాయణ ముందుకు వెళ్లి తీరతాం అని సీఎంను అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే తాము ప్రధానిని ప్రశ్నిస్తాం అని అడిగినప్పటికి కూడా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో పెద్ద గొడవ జరిగింది. దాంతో లక్ష్మీ నారాయణ రోడ్డుపై బైఠాయించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
సీఎం జగన్ విఫలం అయ్యారని ప్రత్యే హోదా కోసం తాడేపల్లిలో సీఎం కార్యాలయం ముట్టడికి పూనుకున్నారు. యువజన JAC విద్యార్ధులు కూడా వీరితో పాటు ఉన్నారు. చలసాని శ్రీనివాస్, జేడీ లక్ష్మీనారాయణ ఇద్దరూ కూడా ముందుకు కదలబోగా పోలీసులు అడ్డగించారు. ఏపీకి ప్రత్యేక హోదాను తీసుకురావడంలోనే కాదు.. విశాఖ ఉక్కు ప్రైవెటీకరణ అంశంలోనూ జగన్ మోహన్ రెడ్డి విఫలం అయ్యారని లక్ష్మీ నారాయణ విమర్శించారు. జగన్‌కు చేత కాకపోతే ప్రత్యేక హోదాను తాము తీసుకొస్తామని సవాల్ విసిరారు.