JC Prabhakar Reddy: రేయ్ స‌జ్జ‌ల నా కొడ‌కా.. జేసీ మాస్ వార్నింగ్

JC Prabhakar Reddy to sajjala and perni nani

 

JC Prabhakar Reddy: తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు పేర్ని నాని, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిల‌పై మండిప‌డ్డారు. త‌న‌ను గ‌తంలో బ‌స్సుల కొనుగోలు విష‌యంలో ఇబ్బందులు పెట్టి అన్యాయంగా త‌నను జైలుకు పంపార‌ని మీడియా ముందుకు కంట‌త‌డి పెట్టుకున్నారు. త‌న కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందుల‌కు గురిచేసార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

“” రేయ్ స‌జ్జ‌ల నా కొడ‌కా.. ఇప్పుడు రారా. ఇప్పుడు నిన్ను చావ‌గొడితే ఎవ‌డికి చెప్పుకుంటావ్ రా. న‌న్ను అరెస్ట్ చేయించి నాకు అన్నం కూడా పెట్ట‌నివ్వ‌లేదు రా నువ్వు. నా స‌మ‌స్య‌కు చంద్ర‌బాబు నాయుడు గారికి ఎలాంటి సంబంధం లేదు. ఇది నా వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌. ఈ స‌మ‌స్య‌కు నాకు ప‌ది రోజుల్లో ప‌రిష్కారం చూప‌క‌పోతే నా కుటుంబంతో క‌లిసి ధ‌ర్నాకు దిగుతా. ఈ గొడ‌వ వ‌ల్ల పార్టీకి న‌ష్టం క‌లుగుతుందంటే పార్టీకి రాజీనామా చేయ‌డానికైనా సిద్ధ‌మే “” అని జేసీ తెలిపారు.