Jayasudha: ఇక మిగిలింది BRS..!
Hyderabad: పార్టీలు మారడం రాజకీయ నాయకులు కొత్తేం కాదు. కానీ సినిమాల్లో తామేంటో ప్రూవ్ చేసుకుని ప్రజల మనసుల్లో చోటు దక్కించుకున్నవారు కూడా పార్టీలు మారడం ఏంటో..! ప్రముఖ నటి జయసుధ (jayasudha)కాంగ్రెస్ నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత TDPలో అడుగుపెట్టి చివరికి BJP చెంత చేరారు. నిన్న BJP తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జయసుధ BJP కండువా కప్పుకున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (congress) తరఫున జయసుధ (jayasudha) సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2016లో ఆమె TDPలోకి వెళ్లారు. ఆ తర్వాత 2019లో TDPకి గుడ్ బై చెప్పేసి YCPలోకి వెళ్లారు. ఇప్పుడు 2023లో ఆమె BJPలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఉమ్మడి ఏపీ సమయంలో అధికారంలో కాంగ్రెస్, TDP మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో BRS (TRS), కాంగ్రెస్, BJP ఉన్నాయి. ఇక ఏపీలో YCP, TDP, జనసేన (janasena) ఉన్నాయి. జయసుధ నియోజకవర్గం సికింద్రాబాద్. ఇది హైదరాబాద్‌లో ఉంది కాబట్టి ఆమె ఉన్నత స్థానంలో ఉన్న పార్టీల్లో మాత్రమే చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నాలుగు పార్టీలు మారిన జయసుధ (jayasudha) ఇక తెలంగాణ నుంచి చూసుకుంటే BRS మాత్రమే మిగిలి ఉంది.
సాధారణంగా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో నుంచే వ్యతిరేకత, విభేదాలు ఏర్పడినప్పుడు వేరే పార్టీ వైపు చూస్తుంటారు రాజకీయనేతలు. జయసుధ పొలిటికల్ కెరీర్‌లో పెద్దగా సాధించినది ఏమీ లేదు. అలాగని పార్టీల్లో ఆమెకు ఎవ్వరూ శత్రువులు కూడా లేరు. అలాంటప్పుడు ఆమె ఇలా ఎందుకు పార్టీలు మారుతున్నారో ఏంటో..!