Jani master: 2034లో ప‌వ‌న్ ప్ర‌ధాని అవుతారు

jani master says pawan kalyan will become pm in 2034

Jani Master: ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ డిప్యూటీ ముఖ్య‌మంత్రి అయ్యారు కానీ.. 2029లో ముఖ్య‌మంత్రి అవుతార‌ని అన్నారు ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్, జ‌న‌సేన నేత జానీ మాస్ట‌ర్ తెలిపారు. విజ‌య‌వాడ వ‌ర‌ద బాధితులకు సాయం చేయాలంటూ ఇత‌ర నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను పిలుపునిచ్చిన జానీ మాస్ట‌ర్ ఈ వ్యాఖ్య‌లు చేసారు. 2029లో ముఖ్య‌మంత్రి అవుతార‌ని.. 2034లో ప్ర‌ధాన మంత్రి అవుతార‌ని.. ఇది రాసిపెట్టుకోవాలంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. స‌మ‌యం సంద‌ర్భం లేకుండా జానీ మాస్ట‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ మొద‌లైంది. పొత్తు పెట్టుకుంటే కానీ డిప్యూటీ సీఎం ప‌ద‌వి ద‌క్కని వాడు ప్ర‌ధాన‌మంత్రి ఎలా అవుతాడు? ఆయ‌న ప్ర‌ధాన మంత్రి అవ‌డానికి దేశ‌మంతా కాపులు లేరుగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.