Janasena: తెలంగాణ‌లో 32 స్థానాల నుంచి పోటీ?

జ‌నసేన (janasena) తెలంగాణ‌లో 32 స్థానాల నుంచి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో (telangana elections) మొత్తం 119 సీట్లు ఉండ‌గా అందులో 32 నుంచి జ‌న‌సేన పోటీ చేస్తుంది. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఏ సీట్ల నుంచి ఎన్ని సీట్ల నుంచి పోటీ చేయ‌నుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఏపీలో ఆల్రెడీ BJPతో పొత్తు పెట్టుకున్న జ‌న‌సేన‌.. ఇటీవ‌ల TDPతోనూ పొత్తు ఉంద‌ని ప్ర‌క‌టించింది. అయితే BJP, జ‌న‌సేన‌, TDP క‌లిసే ఎన్నిక‌ల బ‌రిలో దిగుతాయా లేదా అనేది BJP హై క‌మాండ్‌తో చర్చించి చెప్తాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. మ‌రోప‌క్క TDP తెలంగాణ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయ‌నుంద‌ని.. అయితే తెలంగాణ ఎన్నిక‌ల్లో మాత్రం జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకోమ‌ని ఇప్ప‌టికే నారా లోకేష్ స్ప‌ష్టం చేసారు.