Janasena: క్షమాపణలు చెప్పాల్సిందే..!
AP: జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) వ్యక్తిగత జీవితంపై తప్పుడు కథనాలు, అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై జనసేన (janasena) పార్టీ లీగల్ టీం చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోనుంది. తప్పుడు కథనాలు ప్రచురించే వారిలో అధికార YCPకి చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటుగా, వారికి సపోర్ట్ చేసే యూట్యూబ్ ఛానెల్స్, పలు మీడియా సంస్థలపై చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. వీరు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ (pawan kalyan) తన భార్య ఆన్నా కొణిదెలతో విడిపోయారని, ఆమెను వేరే చోట పెట్టి నెల నెలా ఖర్చులకు డబ్బులు పంపుతున్నారని YCPకి సపోర్ట్ చేసే ఓ ప్రముఖ వెబ్సైట్ న్యూస్ పబ్లిష్ చేసింది. దాంతో మిగతా ఇంగ్లీష్ వెబ్సైట్స్ కూడా పవన్ విడాకులు తీసుకున్నారని రాసేసారు. ఆ తర్వాత పవన్ తన భార్యతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ అందరి నోళ్లు మూయించారు.