Janasena: మేం పొత్తు పెట్టుకోవ‌డంతో ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకున్నారు

YSRCP నాయ‌కుల‌పై మండిప‌డ్డారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (janasena). తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు ప‌సుపు బోర్డు కేటాయించారంటే.. అక్క‌డి ప్ర‌భుత్వం పార్ల‌మెంట్‌లో ఇలాంటి వాటి కోసం పోరాడుతోంద‌ని.. YSRCP నేత‌లు మాత్రం కాఫీ, టీలు తాగ‌డానికి వెళ్తున్నార‌ని విమ‌ర్శించారు.

“” BJPతో పూర్తిగా తెగ‌తెంపులు చేస్తున్నానని కాదు. వారు కూడా మాతో క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని ఆశిస్తున్నాను. చంద్ర‌బాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు నేను కేంద్ర నేత‌ల‌తో మాట్లాడాల‌నుకున్నాను పొత్తు గురించి. కానీ ఆ స‌మ‌యంలో వారంతా జీ20 సమావేశాల్లో బిజీగా ఉండ‌డంతో మాట్లాడ‌లేక‌పోయాను. దాంతో అప్ప‌టి ప‌రిస్థితుల కార‌ణంగా అప్ప‌టిక‌ప్పుడు నిర్ణ‌యం తీసుకుని TDPతో పొత్తు అని ప్ర‌క‌టించేసాను.

నాకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ప్ర‌జ‌ల ఆమోద‌యోగ్య‌మైన ప‌నులు చేయాల‌నే అనుకుంటాం. జ‌న‌సేన‌కు ఎప్పుడూ విశేష ప్ర‌జాస్పంద‌న ఉంటుంది. దానికి ఎప్పుడూ కొద‌వ లేదు. TDPతో పొత్తు పెట్టుకున్నాక చాలా మంది భ‌రోసా వచ్చింది. YSRCP పాల‌న పోయి ఓ కొత్త ప్ర‌భుత్వం రాబోతోంది అన్న భ‌రోసా వారిలో క‌లిగింద‌ని క్లియ‌ర్‌గా తెలుస్తోంది BJP మాతో క‌లిసి వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను. ఒక‌వేళ రాక‌పోతే దాని గురించి మాట్లాడుకుందాం. సో దీని గురించి ఇప్ప‌టి నుంచి చ‌ర్చ వ‌ద్దు

అధికారంలో ఉన్న‌ది ఒక గొప్ప వ్య‌క్తి అయితే ఫ‌ర్వాలేదు కానీ.. త‌నపై త‌నే క‌త్తితో దాడి చేయించుకున్న మాన‌సిక రోగి ఈరోజు రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడు. రోడ్డు మీద ఎవ‌రో చ‌నిపోతేనే మ‌నం అరె ఏమైంది అని అడుగుతాం. అలాంటిది సొంత బాబాయ్‌ని చంపేస్తే గుండెపోటు అని ప్ర‌క‌టించాడు. 30 కేసులు ఉన్న వ్య‌క్తికి అధికారం కట్ట‌బెట్టారు“” అని తెలిపారు. (janasena)