BJPలో జ‌న‌సేన విలీనం!

janasena merging with bjp

BJP: జ‌న‌సేనాని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కేంద్రం చ‌క్రం తిప్పాల‌నుకుంటున్నారా? విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అదే నిజం అని తెలుస్తోంది. జ‌న‌సేన పార్టీని ప‌వ‌న్ భార‌తీయ జ‌న‌తా పార్టీలో విలీనం చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. వ‌చ్చే ఏడాది నాటికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న కుమారుడు నారా లోకేష్‌ను త‌దుప‌రి సీఎంగా ప్ర‌చారం చేయాల‌నే ఉద్దేశంతో ఉన్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌ళ్లీ కూట‌మి ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్రదేశ్‌లో అధికారంలోకి వ‌స్తే అప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయ‌ని అభిమానులు, పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆశ‌ప‌డుతున్నారు.

కానీ చంద్ర‌బాబు నాయుడు ప్లాన్ వేరేలా ఉంది. నారా లోకేష్‌ను త‌దుప‌రి సీఎం అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించాల‌నే స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్లు విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం. కాబ‌ట్టి త‌న సోద‌రుడు చిరంజీవి ప్ర‌జా రాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన‌ట్లు.. జ‌న‌సేన‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీలో విలీనం చేసి ప‌వ‌న్ కేంద్ర మంత్రి హోదాను ద‌క్కించుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇంకా దీనిపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని.. త్వ‌ర‌లో ఏ విష‌యం అనేది తెలుస్తుంద‌నే టాక్ న‌డుస్తోంది.