Janasena: నీ భార్యతో శ్రీవారి దర్శనానికి వెళ్లగలవా జగన్?
జనసేన (janasena) నేత కిరణ్ రాయల్ (kiran royal) ఏపీ సీఎం జగన్‌పై మండిపడ్డారు. ఈరోజు జగన్ (ap cm jagan) కాకినాడలో నిర్వహించిన జగనన్న కాలనీ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ.. జనసేనాని పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు అంటూ మరోసారి వ్యక్తిగత వ్యాఖ్యలు చేసారు. దాంతో తిరుపతిలో కిరణ్ రాయల్ ప్రెస్ మీట్ పెట్టారు.
“” రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా మా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వల్లే అని అంటున్నారేంటి జగన్. మీరు రాముడు అయితే మీకు ఉన్నది ఒక్కరే భార్య అయితే మీ భార్యను తీసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లగలరా? ఆ ధైర్యం మీకు లేదు. ఎందుకంటే మీరు వెళ్తే మీ రెండో భార్య ఒప్పుకోరేమో కదా..! మీరు రాజారెడ్డి రెండో భార్యకు పుట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు అన్న సంగతి మర్చిపోయారా. మా నాయకుడు పవన్ కళ్యాణ్ లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ పెళ్లిళ్లు చేసుకుంటే.. నువ్వు లోకల్, నేషనల్, ఇంటర్నేషన్ క్రిమినల్ అయ్యావుగా. కనీసం మా నాయకుడు చట్టబద్ధంగా విడాకులు తీసుకుని వివాహం చేసుకున్నారు. నీకు దమ్ముంటే ఆయన మూడు పెళ్లిళ్ల విషయంపై నోటీసులు పంపించు చూద్దాం. పంపించలేవు. ఎందుకంటే ఆయన చట్ట విరుద్ధంగా పెళ్లిళ్లు చేసుకోలేదు. ఇంకోసారి పవన్ గురించి వ్యక్తిగత దూషణలు చేస్తే నీ చరిత్రను ప్రింట్ చేయించి పిల్లల పుస్తకాల్లో పబ్లిష్ చేయిస్తాం. ఒక్కసారి నీ బెయిల్ రద్దయితే నువ్వు కూడా నే…….రుగా జైలుకే వెళ్లేది “” అంటూ హెచ్చరించారు. (kiran royal)