Article 370: కాశ్మీర్ నేతలు నిజాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు?
Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జమ్మూ కాశ్మీర్‌కు చెందిన నేతలు మండిపడుతున్నారు. ఒమర్ అబ్దుల్లా, గులామ్ నమీ అజాద్ వంటి సీనియర్ నేతలు ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్‌కు కల్పించిన తాత్కాలిక నిబంధనల అనే నిజాన్ని ఒప్పుకోలేకపోతున్నారు.
డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులామ్ నబీ ఆజాద్ (ghulam nabi azad) సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ.. ఈ తీర్పు బాధాకరం.. దురదృష్టకరం అని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా ఈ తీర్పుతో సంతోషకరంగా లేరని పేర్కొన్నారు. తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారని ఈ తీర్పు అన్నింటికీ అంతం కాదని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ (mehbooba mufti) తెలిపారు.
కాంగ్రెస్ నేత హరీ సింగ్ సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ.. ఇక జమ్మూ కాశ్మీర్ వాసులు నిజాన్ని ఒప్పుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల నిబద్ధతగా ఉండాలని సలహా ఇచ్చారు. కుదరని పని గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనం లేదని అన్నారు. మరోపక్క జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (omar abdullah) స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు బాధించింది కానీ నిరుత్సాహపరచలేదని ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉంటామని తెలిపారు.