Jagan: హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్నా
Jagan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చూసాక హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్నానని అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ప్రజలకు అంతగా మంచి చేసినప్పటికీ.. ఎన్నికలకు ముందు సర్వేలు చేయించినప్పుడు ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేనప్పటికీ ఎన్నికల్లో ఓడిపోయామని.. ఆ నిజాన్ని తనకు నమ్మడానికి మూడు రోజులు పట్టిందని అన్నారు. ఫలితాలు చూసాక వెంటనే హిమాలయాలకు వెళ్లిపోవాలనిపించిందని.. కానీ ఎంత ఓడిపోయినా 40 శాతం ఓట్లు పడినప్పుడు ఆ 40 శాతం ప్రజల గురించి ఆలోచించి ఆగిపోయానని జగన్ పార్టీ నేతలతో చెప్పారు. ఇప్పుడు ఓడిపోయినా మళ్లీ ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసం తప్పకుండా పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని.. కాబట్టి ఫలితాల గురించి బాధపడకుండా మున్ముందు ఏం చేయాలో ఆలోచించాలని సూచించారు.