Jagan: అసెంబ్లీ స‌మావేశాల‌కు జ‌గ‌న్

jagan to attend ap assembly sessions

Jagan: ఈనెల 22 నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో పులివెందుల ఎమ్మెల్యే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అసెంబ్లీకి వ‌స్తారా లేదా అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. జ‌గ‌న్‌తో పాటు మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ స‌మావేశాలకు హాజ‌ర‌వుతార‌ని.. ప్ర‌భుత్వాన్ని నిగ్గ‌దీసి నిల‌దీస్తార‌ని అన్నారు. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో ఉన్న జ‌గ‌న్ శ‌నివారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.