Jagan: చంద్రబాబులో నయా అంటరానితనం..
AP: టీడీపీ(TDP) నేత చంద్రబాబులో(chandrababu) అంటరానితనం ఎక్కువైపోందని ఆరోపించారు ఏపీ సీఎం జగన్(jagan). మచిలీపట్నంలో బందరుపోర్టును ప్రారంభించిన సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. ఎస్సీలు, బీసీలను, ఆడపిల్లల్ని కనే ఆడవాళ్లను, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియమే ఉండాలనుకునే చంద్రబాబుది ఏ రకమైన మనస్తత్వమో ప్రజలందరికీ తెలుసని జగన్ అన్నారు. చంద్రబాబు తన పాలనలో పేదలకు ఒక్క సెంటు భూమి అయినా ఇచ్చిన పాపాన పోలేదని ఆరోపించారు.
“మనందరి ప్రభుత్వంలో ఇస్తుంటే అన్ని కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారు. అమరావతిలో పేదలకు ఇళ్లిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని.. చంద్రబాబు రూపం మార్చుకున్న అంటరానితనానికి, నయా పెత్తందారీ భావజాలానికి తెరతీశారు. చంద్రబాబు అండ్ కో, దుష్టచతుష్టం, గజదొంగల ముఠాగా అధికారం కోసం ప్రజలను మరోసారి మాయమాటలతో మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖలో చంద్రబాబు పేదల గురించి మాట్లాడిన మాటలు పేద వర్గాలకు మరింత బాధ కలిగించాయి. పేదలకు శాశ్విత చిరునామాలుగా మారుతున్న ఇళ్లను, ప్రభుత్వం అందిస్తున్న ఇళ్ల స్థలాల రూపంలో ఇస్తున్న గోప్ప పవిత్ర స్థలాలను సమాధులు, స్మశానాలతో పోల్చి మన పేదలను దారుణంగా అవమానించారు. ఇలాంటి చంద్రబాబుకు మానవత్వం ఉందా అని ప్రజలు ఆలోచించాలి” అని మచలీపట్నం పోర్టు నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభలో సీఎం జగన్ అన్నారు.