EXCLUSIVE: “ఇప్పుడెందుకులే..!”
EXCLUSIVE: సాధారణంగా కుటుంబంలో సమస్యలు వస్తే ఏదో ఒక శుభకార్యంతో మళ్లీ అంతా కలిసిపోతే బాగుండు అనుకునేవారు చాలా మందే ఉంటారు. ఇంకొందరైతే శుభకార్యానికి అయినవాళ్లను కూడా పిలవకుండా జీవతాంతం శత్రువుల్లా మిగిలిపోతుంటారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) రెండో కోవకే చెందుతారేమో అనిపిస్తోంది.
మేనల్లుడి పెళ్లి దగ్గరపడుతుంటే ఇంకా చెల్లెలు షర్మిళను అక్కున చేర్చుకోలేకపోతున్నాడు. సరే.. ఎన్ని సమస్యలు, గొడవలు ఉన్నా అన్న కాకుండాపోతాడా అని మొదటి శుభలేఖను జగన్‌కు ఇవ్వడానికి ఆయన ఇంటికి వెళ్లారు షర్మిళ (ys sharmila). అయితే జగన్ ఇంటికి నేరుగా కాకుండా సీఎంఓ కార్యాలయానికి ఫోన్ చేసి మరీ వెళ్లాల్సి వచ్చిందట.
నేను వస్తున్నాను అన్నను కలిసి శుభలేఖ ఇవ్వాలి అని షర్మిళ చెప్పినప్పుడు వారు జగన్‌కు సమాచారం అందించారు. అప్పుడు జగన్.. షర్మిళ వస్తోందా..? ఎందుకబ్బా ఇప్పుడు. BJP వారికి తెలిస్తే రచ్చ అవుతుంది అని అన్నారట. అందుకే ఇక తప్పక శుభలేఖ తీసుకుని ఒక్క ఫోటో కూడా బయటికి రానివ్వకుండా ఎంతో జాగ్రత్తపడ్డారు. ఇప్పుడు షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి.. జగన్ షర్మిళతో కలిసిపోయినా కాంగ్రెస్‌తో కలిసిపోయినట్లే అవుతుంది కాబట్టి జగన్‌కు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ లభించదు అని భయపడుతున్నారు. వారితో పొత్తు కోసమే చెల్లిని కూడా దూరం పెట్టేందుకు జగన్ వెనుకాడలేదు.