Prashant Kishor: మళ్లీ ప్రశాంత్ కిశోర్ చెంతకే
Prashant Kishor: ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్.. ఐప్యాక్ మాజీ హెడ్ ప్రశాంత్ కిశోర్ మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఓ మాటన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఈసారి ఓడిపోవడమే కాదు.. ఘోరంగా ఓడిపోబోతున్నారు అని. ఆ మాటలను జగన్ పట్టించుకోలేదు. తాను నమ్ముకున్న ఐప్యాక్ వారి చేతే సర్వేలు చేయించుకుని మళ్లీ అధికారం వైఎస్సార్ కాంగ్రెస్‌దే అనే ధీమాను వ్యక్తం చేసారు. కట్ చేస్తే.. ఓడిపోవడం కాదు.. 11 సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ప్రశాంత్ కిశోర్ చేసిన కామెంట్ వైరల్‌గా మారింది. అందుకే ఫేక్ జర్నలిస్ట్‌లు.. టీవీల్లో స్టూడియోల్లో కూర్చుని ఫేక్ డిబేట్లు పెట్టేవారిని నమ్మద్దు అని.
ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్.. తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించాలని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దాంతో ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ అవసరం తనకు ఉందని బోధపడినట్లుంది. అందుకే మెల్లినా ప్రశాంత్‌ను మళ్లీ తనవైపు తిప్పుకోవాలని జగన్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలవాలన్న ఉద్దేశంతో ప్రశాంత్‌ను ఇప్పటి నుంచే రంగంలోకి దించాలని జగన్ యోచిస్తున్నారట. మొన్న ఎన్నికల్లో పనిచేసిన ఐప్యాక్ హెడ్ రిషి రాజ్ సింగ్‌ను పక్కనపెట్టి మళ్లీ ప్రశాంత్‌కే బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నారు.
ఎన్నికల ప్రచారం సమయంలో తెలుగు దేశం పార్టీకి బాగా కలిసొచ్చిన ప్లాన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, లిక్కర్ పాలసీ. ఈ రెండు అంశాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయని తెలుగు దేశం పార్టీకి చెప్పిందే ప్రశాంత్ కిశోర్ అట. దాంతో జగన్ చూపు మళ్లీ ప్రశాంత్ వైపే మళ్లింది. అయితే జగన్ పిలవగానే జీ హుజూర్ అనుకుంటూ ప్రశాంత్ వస్తారన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్ పార్టీ పేరుతో బిహార్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బిహార్ ఎన్నికల్లో గెలిస్తే ఇక ప్రశాంత్ కిశోర్ కన్సల్టింగ్ సంస్థల జోలికి వెళ్లే ప్రసక్తే లేదు. ఒకవేళ ఓడిపోతే జగన్ కోసం పనిచేసే అవకాశాలు ఉన్నాయి.