Jagan: జగన్ రాజీనామా ? కడప నుండి ఎంపీగా పోటీ !?
Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయనున్నట్లు జోరుగా ప్రచారం అందుకుంది. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు జగన్ జంకుతున్నారని టాక్. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో అసెంబ్లీలో తమ గోడు వినిపించుకునే నాథుడు ఉండడని జగన్ ఆల్రెడీ తన పార్టీ నేతలతో పలు సమావేశాల్లో చెప్పారు.
కాబట్టి ఆయన అసెంబ్లీకి వెళ్లే పరిస్థితులు కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో జగన్‌కి ఓ ఆలోచన వచ్చిందట. అసెంబ్లీకి వెళ్లడం కంటే పార్లమెంట్‌కు వెళ్తే కాస్త గౌరవం దక్కుతుందని ఆయన యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే ఆయన పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. కడపలో అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి తాను అక్కడ ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కడపలో తాను పక్కాగా గెలుస్తాను అనే నమ్మకం ఉండటంతో అక్కడ గెలిచి పార్లమెంట్‌కు వెళ్లాలని జగన్ అనుకుంటున్నారట.