Ambati Rambabu: అంబటికి జగన్ షాక్..!
Ambati Rambabu: YSRCP మంత్రి అంబటి రాంబాబు… ఆంధ్రప్రదేశ్‌లో ఈ పేరు తెలీనివారు ఉండకపోవచ్చు. ప్రస్తుతం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగన్ (Jagan Mohan Reddy) కేబినెట్‌లో నీటి పారుదల శాఖ బాధ్యతలు చేపడుతున్నా.. నోటిపారుదల శాఖ మంత్రిగా బాగా పేరుంది. తనకు ఓటేసి గెలిపించిన సత్తెనపల్లి నియోజకవర్గం అభ్యర్ధిత్వం తన మంత్రిత్వ శాఖపై పెద్దగా శ్రద్ధ లేకపోయినా తెలుగు దేశం (Telugu Desam Party), జనసేన (Janasena) పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) , పవన్ కళ్యాణ్‌లపై (Pawan Kalyan) నోరు పారేసుకుంటారనే విమర్శలు ఉన్నాయి. దీంతోనే రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారనే టాక్ ఉంది. YSRCPలో కీలక నేతగా ఉన్న రాంబాబుకు వచ్చే ఎన్నికల్లో (AP Elections) సీటు వచ్చే అవకాశం కష్టమే అనే ప్రచారం జరుగుతోంది. (Ambati Rambabu)
బాపట్ల జిల్లా రేపల్లె వాసి అయిన అంబటి రాంబాబు.. 2019లో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. కానీ వచ్చే ఎన్నికల్లో సీటు లేదని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల వైసీపీ సత్తెనపల్లి అభ్యర్ధిపై IVRS సర్వే చేయించింది. ఈ స్థానం వైసీపీ అభ్యర్ధిగా పెన్నెల్లి వెంటకరామిరెడ్డిని స్వీకరిస్తారా లేదా అని సర్వే చేయించగా.. ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. ఈ సర్వేలో అంబటి రాంబాబు పేరు లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో సీటు లేదనే టాక్ సత్తెనపల్లి నియోజకవర్గంలో వ్యాపిస్తోంది.
ALSO READ: Ambati Rambabu: పవన్‌కి పావు వంతు సీట్లు కూడా ఇవ్వలేదు
సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి తెలుగు దేశం పార్టీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ పోటీకి దిగుతున్నారు. ఈ నేతపై మంత్రి అంబటి రాంబాబును బరిలోకి దింపితే గెలిచే అవకాశాలు లేవని తేలినట్లు టాక్ ఉంది. దాంతో సత్తెనపల్లి వైపీపీ అభ్యర్ధిని మార్చాలని తాడేపల్లి అభ్యర్ధులు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబుకు బదులు పిన్నెల్లి వెంటకరామిరెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
వారం రోజుల క్రితం పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పేరుతో ఫోన్లు రాగా.. లేటెస్ట్‌గా ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరుతో సత్తెనపల్లి ఓటర్లకు IVRS సర్వే కాల్స్ వస్తున్నాయని వినిపిస్తోంది. పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోదరుడు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ సర్వే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పిన్నెల్లి వెంకటరామిరెడ్డికో లేదా ఆళ్ల రామకృష్ణారెడ్డికో (Alla Ramakrishna Reddy) సత్తెనపల్లి సీటు ఇస్తే అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవల వైసీపీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. APCC చీఫ్ వైఎస్ షర్మిళ (YS Sharmila) నాయకత్వాన్ని సమర్ధిస్తూ కాంగ్రెస్ (Congress) తీర్థం పుచ్చుకోవాలని అనుకున్నారు. తాను వైఎస్ షర్మిళ వెంటే నడుస్తానని పబ్లిక్‌గా ప్రకటించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఉన్నట్టుండి మళ్లీ వైసీపీ గూటికే చేరుకున్నారు. విజయసాయి రెడ్డి కలగజేసుకుని ఆళ్ల రామకృష్ణరెడ్డిని ఒత్తిడికి గురిచేయడంతోనే ఆయన మళ్లీ వైసీపీలోకి బలవంతంగా వెళ్లాల్సి వచ్చిందన్న టాక్ కూడా ఉంది.
మరోవైపు ఇప్పటివరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 8 చోట్ల వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలను మార్చారు. పల్నాడు జిల్లా నుంచి ఎవరూ లేరు. కానీ ఇప్పుడ మంత్రి అంబటిని పక్కన పెడతారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పిన్నెల్లి వెంకటరామిరెడ్డికో లేదా ఆళ్ల రామకృష్ణారెడ్డికో లేదా కొత్త అభ్యర్ధికో సీటు ఇచ్చినా కూడా మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ చేతిలో ఓటమి ఖాయం అనే టాక్ కూడా వినిపిస్తోంది.