Jagan: అలా చేసుంటే నేను ఇప్పుడు సీఎం పదవిలో ఉండేవాడిని
Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన అబద్ధపు హామీలు తాను కూడా ఇచ్చి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాడినని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి. కానీ అలా చేసి ఉంటే ఈరోజు ఎక్కడా తలెత్తుకుని తిరగకుండా ఉండే పరిస్థితి ఏర్పడేదని అన్నారు. రేపెల్లెలో పార్టీ నేతలు, సమన్వయ కార్యకర్తల కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
“” మేనిఫెస్టో అనేది చెత్తకుప్పలో పడేసే డాక్యుమెంట్ కాదు ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చాటిచెప్పిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మొదటిసారి ఏకంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు సంక్షేమ క్యాలెండర్ కూడా ప్రకటిస్తూ ఏ పథకం ఇస్తున్నామో ముందే ప్రకటించిన ప్రభుత్వం కూడా మనదే. ఏ నెల కూడా మిస్సవ్వకుండా ప్రతి నెలా బటన్ నొక్కి పారదర్శకంగా ప్రతి ఇంటికీ లబ్ది జరిగిందంటే అది మన ప్రభుత్వంలోనే. లంచాలు లేకుండా డెలివరీలు చేయొచ్చు అని రుజువు చేసింది కూడా మనమే.
చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో నీకు పదిహేను వేలు నీకు ఇరవై వేలు అని అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసాడు. ఇప్పుడు వారు ఎప్పుడెప్పుడు డబ్బులు పడతాయా అని ఎదురుచూస్తే పరిస్థితి. ఇవే అబద్ధాలు నేనూ చెప్పి ఉంటే ఈరోజు నేనే ముఖ్యమంత్రి అయ్యేవాడిని. కానీ నేను ఆ హామీలు నెరవేర్చలేకపోతే మా డబ్బులు ఎక్కడ అని అడుగుతారు. అది చాలా తప్పు. అందుకే నేను నిజాన్ని నమ్ముకున్నాను. నిజాయతీగా ఉండే వారి వైపే దేవుడు ఉంటాడు అని నేను నమ్ముతాను “” అని తెలిపారు.