Jagan Mohan Reddy: చంద్రబాబు.. మనం మనం నాయకులం.. ఇది కరెక్ట్ కాదు
Jagan Mohan Reddy: ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ నేత పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని జైల్లో కలిసారు పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డి. ఆ తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు.
“” చంద్రబాబు నాయుడు.. మనం నాయకులం.. నువ్వు తప్పుడు సంప్రదాయానికి రాజకీయాల్లో నాంది పలుకుతున్నాం. ఈరోజు నువ్వేసే తప్పుడు బీజం రేపు పెద్ద చెట్టు అవుతుంది. అప్పుడేంటి పరిస్థితి? పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై మర్డర్ అటెంప్ట్ కేసు ఎలా పెడతారు? పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ జరుగుతుంటే అది తప్పు అని చెప్పేందుకు పిన్నెళ్లి ఈవీఎం ధ్వంసం చేసాడు. ఇక తప్పు జరుగుతోందని నోటితో చెప్తే ఎవరు వింటారు? అందుకే ధ్వంసం చేయాల్సి వచ్చింది. ఈ కేసులో బెయిల్ వస్తే పది రోజుల తర్వాత మర్డర్ అటెంప్ట్ కేసులో జైల్లో పెట్టారు. మర్డర్ అటెంప్ట్ జరిగి ఉంటే వారం రోజుల్లో సిట్ నివేదిక ఎందుకు ఇవ్వలేదు? ఎవడు పడితే వాడు రెడ్ బుక్ పట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
పిన్నెళ్లి నాలుగు సార్లూ ఊరికే ఎమ్మెల్యే అయ్యారా? పిన్నెళ్లి మంచివాడు కాకపోతే నాలుగు సార్లు ఎలా గెలుస్తారు? ఇప్పటివరకు చంద్రబాబుని ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు అని రిక్వెస్ట్ చేసాం. ఇక నేను హెచ్చరిస్తున్నా. ఇలాగే కొనసాగితే ఊరుకునేది లేదు. రాజకీయాలు రోజులు ఎప్పటికీ ఒకేలా ఉండవు. అది చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆయనది అధికారం. ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉంటే బాగుంటుంది. హామీలు నెరవేర్చి ఎన్నికల్లో ఓట్లు అడిగితు ప్రజల గుండెల్లో నిలిచిపోతాం. అంతేకానీ ఇలాంటి పనులు చేస్తే ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్తారు “” అన్నారు.