Jagan: జ‌గ‌న్‌కు బిగ్ షాక్.. పాస్‌పోర్ట్ ర‌ద్దు

jagan mohan reddy passport gets cancelled

Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి షాక్ ఎదురైంది. ఈరోజు ఆయ‌న లండ‌న్ ప‌ర్య‌ట‌న ర‌ద్దైంది. ఇందుకు కార‌ణం ఆయ‌న పాస్ పోర్టు క్యాన్సిల్ అవ్వ‌డ‌మే. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి పోవ‌డంతో ఆయ‌న డిప్లొమాట్ పాస్‌పోర్టు ర‌ద్ద‌య్యింది. ఈ నేప‌థ్యంలో జ‌న‌ర‌ల్ పాస్‌పోర్ట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. దీనిపై CBI కోర్టు విచార‌ణ‌ను వాయిదా వేసింది. జ‌గ‌న్‌పై కేసులు న‌మోదై ఉన్న నేప‌థ్యంలో CBI కోర్టు ఐదేళ్ల పాటు జ‌న‌ర‌ల్ పాస్‌పోర్ట్ ఇవ్వాల‌ని లంచ్ మోష‌న్ పిటిష‌న్ వేసారు. దీనిపై విచార‌ణ‌ను కోర్టు వాయిదా వేసింది. దాంతో ఈరోజు లండ‌న్‌కు వెళ్లాల్సిన జ‌గ‌న్ త‌న ప‌ర్య‌ట‌న‌ను క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.