Jagan Mohan Reddy: నన్ను లం**** కొడకా అని తిడితే సురేష్ ఎదురుతిరిగాడు
Jagan Mohan Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. గుంటూరు సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న తన పార్టీ నేత నందిగం సురేష్‌ను కలిసారు. రెండు సంవత్సరాల క్రితం తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో భాగంగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సురేష్‌ను కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. “” ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన తప్ప ఏమీ జరగడం లేదని క్లియర్‌గా తెలుస్తోంది. విజయవాడ వరదల విషయంలో ప్రభుత్వ వైఫల్యం ఉంది కాబట్టే ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయంతో టాపిక్ డైవర్ట్ చేసేందుకు నందిగం సురేష్ అనే దళిత బిడ్డను అరెస్ట్ చేసారు. అసలు సురేష్ చేసిన తప్పేంటి? 2021లో.. అంటే నాలుగు సంవత్సరాల క్రితం.. తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి అయిన పట్టాభి అనే వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి.. అంటే నన్ను పట్టుకుని బోస్‌డీకే అని తిట్టాడు.
బోస్‌డీకే అంటే ఏంటో తెలుసా? లం*** కొడకా. మరి ఈ మాదిరగా ఓ ముఖ్యమంత్రిని పట్టుకుని తిడితే నన్ను ప్రేమించే వ్యక్తుల్లో ఒకరైన నందిగం సురేష్ కోపంతో తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసాడు. అది తప్పా? నన్ను తిడితే కడుపు మండినవారు… ఇది అన్యాయం అని భావించేవారు కొందరు వెళ్లి తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై ఎదురుతిరిగారు. ఆ రోజు మా వాళ్లు ధర్నా చేస్తుంటే వారిపై దాడి చేసేందుకు యత్నించారు. ఆ దాడిలో కార్యాలయంలోని కొన్ని సామాన్లు పగిలాయి. కానీ మా వాళ్లే వెళ్లి దాడి చేసారు అని తప్పుడు కేసు పెట్టి సురేష్‌ను లోపలేసారు.
నన్ను లం*** కొడకా అని తిట్టినప్పటికీ నేను చంద్రబాబు నాయుడుపై కక్ష్య సాధింపు చర్యలు చేపట్టలేదు. అయినప్పటికీ కార్యాయలంపై దాడి చేయడం తప్పు కాబట్టి నేను ఆ కార్యాలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించి ఎవరు వెళ్లి ధర్నా చేసారో చూసి వారందరికీ 41A కింద నోటీసులు ఇచ్చే చర్యను చేపట్టాను. మరి ఇంత చేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు పాత కేసును తవ్వి సాక్షులను బెదిరించి తప్పుడు పేర్లు రాయించుకుని తప్పుడు అరెస్ట్‌లు చేయిస్తున్నారు. ఈ తప్పుడు సంప్రదాయం కొనసాగితే.. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు అని గుర్తుపెట్టుకోండి. ఈ సంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపు మీ నాయకులకు ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లో మీరంతా ఉంటారు అని గుర్తుంచుకోండి. రెడ్ బుక్‌లు మీ దగ్గర మాత్రమే కాదు. మా దగ్గర కూడా ఉంటాయి. “” అని వెల్లడించారు.