Jagan: చుక్కలు చూపిస్తున్న రఘురామ.. జగన్‌కు సుప్రీం నోటీసులు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి (jagan) సుప్రీం కోర్టు (supreme court) నోటీసులు జారీ చేసింది. అక్రమ ఆస్తుల కేసును తెలంగాణ సీబీఐకి అప్పగిస్తే దాదాపు 3000 సార్లు కేసును వాయిదా వేసారని అసలు ఎందుకు ఇంత జాప్యం జరుగుతోందని YSRCP అసమ్మతి నేత రఘురామ కృష్ణంరాజు (raghu rama krishnam raju) తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జగన్‌తో పాటు తెలంగాణ సీబీఐకి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ కేసును తెలంగాణ, ఏపీ కాకుండా ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని పిటిషన్‌లో కోరారు. ప్రస్తుతానికి ఈ కేసు విచారణను జనవరికి వాయిదా వేసింది.