జ‌గ‌న్ ఇంటి వ‌ద్ద ప్రైవేట్ సెక్యూరిటీ

jagan mohan reddy gets private security for his home

Jagan: తాడేప‌ల్లిలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇంటి వ‌ద్దకు ప్రైవేట్ సెక్యూరిటీ బ‌ల‌గాలు చేరుకున్నాయి. తాడేప‌ల్లి ప్యాలెస్ ఉన్న ర‌హదారిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు తెర‌వ‌డం.. ప్ర‌స్తుతం ఉన్న భద్ర‌త‌ను కుదించ‌డంతో జ‌గ‌న్ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టించుకున్నారు. దాదాపు 30 మంది సెక్యూరిటీ సిబ్బంది జ‌గ‌న్ ఇంటికి చేరుకున్నారు. 2019కి ముందు కూడా జ‌గన్ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారు.