Jagan Mohan Reddy: ప్ర‌మాణ స్వీకారం స‌మ‌యంలో పేరు త‌ప్పు ప‌లికిన మాజీ సీఎం

jagan mohan reddy could not pronounce his own name during oath ceremony

Jagan Mohan Reddy: ఈరోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేసారు. మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం ఈరోజే చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేస్తూ జ‌గ‌న్ మోహ‌న్ అనే నేను అని ప‌లికి ఆ త‌ర్వాత త‌న త‌ప్పును స‌రిదిద్దుకుని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనే నేను అని మ‌ళ్లీ చ‌ద‌వాల్సి వ‌చ్చింది. ఓటమి ఎంత దుర్మార్గమైంది అంటే సొంత పేరు కూడా తప్పు పలికేంత అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు.