Jagan: ప‌వ‌న్ భార్య‌తో 3 ఏళ్లు.. చంద్ర‌బాబుతో 13 ఏళ్లు ఉంటాడ‌ట‌

Jagan: మ‌రోసారి ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను ప‌బ్లిక్ మీటింగ్‌లో ప్ర‌స్తావించారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో ఏర్పాటుచేసిన కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  భార్య‌ల‌తో మూడేళ్లు.. చంద్ర‌బాబు నాయుడుతో (chandrababu naidu) 13 ఏళ్లు ఉంటానని ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో చెప్పుకుంటున్నాడ‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు.

14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు.. త‌న ప‌ద‌వీ కాలంలో ఏం మంచి చేసాడో చెప్పి ఓట్లు అడ‌గాలి కానీ మంచి చేయ‌లేదు కాబ‌ట్టే త‌న‌పై ప‌డి ఏడుస్తున్నాడ‌ని అన్నారు. రెండు విషాలు క‌లిస్తే అమృతం అయిపోతుందా అని తెలుగు దేశం పార్టీ జ‌న‌సేన పొత్తుపై కామెంట్ చేసారు. భీమ‌వ‌రం ప్ర‌జ‌లు ఓడించిన ద‌త్తపుత్రుడు ప‌క్క రాష్ట్రంలో ఉంటాడ‌ని ప‌క్క వ్య‌క్తిని సీఎం చేసేందుకు ఎవ్వ‌రూ పార్టీ పెట్టర‌ని ప‌వ‌న్‌పై సెటైర్ వేసారు. ప‌వ‌న్‌కు ఎన్ని సీట్లు ఇచ్చినా ఇవ్వ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు కానీ చంద్ర‌బాబును మాత్రం ముఖ్య‌మంత్రిని చేసేయాల‌ని ప‌వ‌న్ ఉవ్విళ్లూరుతున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు.