Jagan Meets Roja: రోజాను క‌లిసి ఓదార్చిన జ‌గ‌న్

Jagan Meets Roja and consoles her for losing elections

Jagan Meets Roja: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. న‌గిరి మాజీ ఎమ్మెల్యే రోజాను క‌లిసారు. జ‌గ‌న్‌ను చూడ‌గానే రోజా క‌న్నీరుపెట్టుకున్నార‌ట‌. దాంతో జ‌గ‌న్ బాధ‌ప‌డ‌కు రోజా అని ఆమెను ఓదార్చే ప్ర‌య‌త్నం చేసారు. సొంత పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లే త‌న‌ను ఓడ‌గొట్టారని ఈ సంద‌ర్భంగా రోజా జ‌గ‌న్‌కు త‌న గోడు చెప్పుకున్నట్లు స‌మాచారం.

అన్నీ స‌మీక్ష చేద్దామ‌ని అధైర్య‌ప‌డొద్ద‌ని రోజాకు జ‌గ‌న్ ధైర్యం చెప్పారు. రేపు జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌తో విస్తృత స్థాయిలో స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్నారు. రెండు రోజుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల‌తో జ‌గన్ అసెంబ్లీకి వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌ని సంద‌ర్భంగా అసెంబ్లీలో ఎలా న‌డుచుకోవాలో నేత‌లతో రేపు స‌మావేశంలో చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం.