సీఎంగా ఉన్నప్పుడు ఒక్కరినీ కలవక.. అధికారం పోగానే ఒకేసారి కలిసి..
Jagan: జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఎంపీని కానీ ఎమ్మెల్యేని కాని కలిసి మాట్లాడిన పాపాన పోలేదు. ఎవరైనా కలవడానికి వెళ్లినా గేటు బయటే రాత్రి వరకూ నిలబెట్టేవాడు. కొందరికైతే అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. ఈ విషయం వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే చాలా సార్లు చెప్పారు.
అలాంటిది ఇప్పుడు అధికారం పోగానే.. మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను ఒకేసారి తన ఇంటికి పిలిపించుకుని మరీ కలిసారు. అయితే అహంకారం మాత్రం వీడలేదనే చెప్పాలి. వయసులో పెద్దలున్నా నిలబెట్టే మాట్లాడే తీరు.. ఎన్నటికి మారుతుందో ఈ బుద్ధి అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.