Nara Lokesh: జగన్ చేసిన అతిపెద్ద తప్పు ఇది
జగన్ (jagan) చేసిన అతిపెద్ద తప్పు చంద్రబాబు నాయుడుని (chandrababu naidu) అరెస్ట్ చేయించడం అని.. దీనికి పర్సనల్‌గా రాజకీయంగా త్వరలో బుద్ధిచెప్తామని నారా లోకేష్ (nara lokesh) హెచ్చరించారు. చంద్రబాబు నాయుడికి కానీ కుటుంబ సభ్యులకు కానీ స్కిల్ డెవలప్మెంట్ నుంచి డబ్బులు అందినట్లు ఆధారాలు చూపించగలరా అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వాన్ని వెంటాడతానని న్యాయం నిలబడే వరకు పోరాడతానని తెలిపారు. ఏదైనా కంపెనీ తెస్తేనో లేదా పరిశ్రమను ఏర్పాటుచేస్తేనో సంబరాలు చేసుకుంటారు కానీ ఒక నేతను అరెస్ట్ చేయించి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారంటే వారిది కక్ష సాధింపు చర్యేనని క్లియర్‌గా అర్థమవుతోందని అన్నారు. (nara lokesh)
“” సీఐడి కక్ష సాధింపు డిపార్ట్మెంట్. ప్రజల కోసం పనిచేస్తే వారిపై కేసులుపెట్టే డిపార్ట్మెంట్ సీఐడి. జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్. అందుకే అరెస్ట్‌లు చేయిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనక BJP ప్రభుత్వం ఉందో లేదో వారినే అడగాలి. నాకు తెలిసినంత వరకు మా నాన్న అరెస్ట్ వెనక YSRCP ప్రభుత్వం ఉంది. రిమాండ్ రిపోర్ట్‌లో మా నాన్నకు డబ్బు అందిందో లేదో చెప్పలేకపోయారు. అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మా ఆస్తులన్నీ బయటపెట్టాం. దొంగ కేసులు పెడుతున్నారు. మమ్మల్ని కక్ష సాధింపు చర్యలో భాగంగానే జైలుకి పంపిస్తున్నారు. రెండు ఏళ్లుగా ఎందుకు చంద్రబాబుని విచారణకు పిలవలేదు.
పింక్ డైమండ్ అన్నారు.. ఆ పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని నిరూపించారా? అమరావతిలో ఒక్క గజం ఆయన కొన్నారని నిరూపించారా? మా పోరాటాలను ఆపాలని దొంగ కేసులు పెడుతోంది ఈ ప్రభుత్వం. కానీ మేం ఆపం. వదలం. తెలుగు దేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. ఇందిరా గాంధీ, వైఎస్సార్లతో పోరాడాం. జగన్ మాకో లెక్కనా? జైలుకి పంపించినంత మాత్రాన మా TDP పోరాటం ఆగలేదు. ఆగదు కూడా. ఇది మాకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే. నేను అన్నగా భావించే పవన్ కళ్యాణ్, మమతా బెనర్జీలు మాకు అండగా నిలబడ్డారు. జోహో కంపెనీని తీసుకొచ్చినప్పుడు ఆ కంపెనీ ఎండీ శ్రీధర్ కూడా మాకు అండగా ఉన్నారు. కార్యకర్తలు, నాయకులు నాకు తోడుగా ఉన్నారు. నేను ఒంటరిని ఎందుకు అవుతాను? ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ సైకో జగన్‌ని తరిమికొడదామా అని ఎదురుచూస్తున్నారు. (nara lokesh)
ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పోరాడినా వారిపై దొంగ కేసులు పెడతారు.. వారి ఫ్యామిలీలను రోడ్డుపైకి లాగుతారు.. వాళ్ల ఫోటోలను మార్ఫ్ చేసి వైరల్ చేస్తారు. సొంత తల్లి, చెల్లిని బయటికి తరిమిన సైకో జగన్. ఒకసారి నిర్ణయం తీసుకుని ముందకెళ్తే ఎవరు వచ్చినా తొక్కుకుంటూపోతాం. గతంలో చాలా మంది ట్రై చేసారు. వారిని కూడా తొక్కుకుంటూ వెళ్లాం. అదే పరిస్థితి జగన్‌కు రాబోతోంది. జగన్ లాగా పారిపోయే అలవాటు నాకు లేదు. యువగళం టెంపరరీగా సస్పెండ్ చేసాం. మా నాయకుడిపై దాడి జరిగింది కాబట్టి ఆ దాడిని ఆపాల్సిన బాధ్యత నాపై ఉంది. మళ్లీ ఎప్పుడు ప్రారంభించాలో డిస్కస్ చేసి చెప్తాం. నేను బూతులు మాట్లాడుతున్నాని చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించారా? సజ్జల అనేది బూతు పదం కాదు కదా.. ఒకవేళ అది బూతు పదం అయితే ఆయన్ను పేరు మార్చుకోమనండి. మా నాన్న 20 గంటల పాటు ప్రజల కోసం పనిచేసేవారు. నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు మా నాన్నను నేరుగా చూసాను. అప్పటివరకు ఆయన్ను టీవీలు, పేపర్లలోనే చూసేవాడిని. అలాంటి ఆయనపై దొంగ కేసు పెట్టి జైల్లో పెట్టించారు “” అని ఆవేదన వ్యక్తం చేసారు నారా లోకేష్ (nara lokesh)