జ‌గ‌న్ కాన్వాయ్‌కి ప్ర‌మాదం

jagan convoy vehicle hits fire engine

Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాన్వాయ్‌కు స్వల్ప ప్ర‌మాదం జ‌రిగింది. ఈరోజు ఆయ‌న క‌డ‌ప‌లోని పులివెందుల‌కు బ‌య‌లుదేరారు. ఎయిర్‌పోర్ట్ నుంచి పులివెందుల‌కు వెళ్తుండ‌గా రామ‌రాజుప‌ల్లి వ‌ద్ద కాన్వాయ్‌లోని రెండు వాహ‌నాలు ఢీకొన్నాయి. ఆయ‌న వాహ‌న శ్రేణిలోని ఇన్నోవా వాహ‌నాన్ని ఓ ఫైర్ ఇంజిన్ వాహ‌నం ఢీకొన‌డంతో కారు స్వ‌ల్పంగా దెబ్బ‌తింది. వాహ‌నంలోకి ఎవ్వరికీ ఏమీ జ‌ర‌గ‌లేదు. కొన్ని నిమిషాల అనంత‌రం జ‌గ‌న్‌ను సుర‌క్షితంగా పులివెందులకు త‌ర‌లించారు.