ఆస్తి ఇచ్చేస్తా.. చెల్లెలి చెంతకు అన్న
Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. APCC చీఫ్ వైఎస్ షర్మిళ .. ఒకే తల్లి కడుపున పుట్టినా ఇప్పుడు వారి మధ్య వైరం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇందుకు కారణం.. జగన్ అధికారంలోకి వచ్చాక షర్మిళకు ఎలాంటి పదవి.. ఆమెకు రావాల్సిన ఆస్తి ఇవ్వకపోవడం. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దాంతో ఇప్పటివరకు తల్లిని, చెల్లిని దూరం పెడుతూ వచ్చాడు జగన్. అందుకే షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది. అయితే.. మొన్న జరిగిన ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయిన జగన్ను తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందట. ఇందుకు షర్మిళ ఒప్పుకోకపోవడం ఆ నిర్ణయాన్ని మానుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాలన్నీ పక్కనపెడితే.. ఇప్పుడు అన్నాచెల్లి మధ్య రాజీ కుదిరినట్లు తెలుస్తోంది. ఇటీవల షర్మిళ జగన్ను కలిసేందుకు బెంగళూరుకు వెళ్లారట. అక్కడ జగన్ షర్మిళతో చర్చించి ఆస్తి పంపకాలు చేసేస్తానని చెప్పినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఆల్మెస్ట్ చర్చలు సఫలమయ్యాయి. రేపో మాపో అన్నాచెల్లి కలిసిపోతారు. ఆ తర్వాత షర్మిళే దగ్గరుండి జగన్ను కాంగ్రెస్తో కల్పించే అవకాశాలు ఉన్నాయట.