YS Viveka Murder Case: వేటు వేస్తాం.. నివాళులు అర్పిస్తాం!

YS Viveka Murder Case: 5ఏళ్లు…

మాజీ ముఖ్యమంత్రికి స్వయానా తోడబుట్టిన తమ్ముడు

ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయ్

స్వతహాగా ఆయనే మాజీ మంత్రి

అతి కిరాతకంగా హత్య కావింపబడి నేటికి 5 ఏళ్లు

ఇప్పటికే చిక్కుముడిగానే హూ కిల్డ్ బాబాయ్

నాడు ఆ బాబాయ్ హత్యని ఉపయోగించుకొని సానుభూతి రాజకీయాలు చేసినవారే

నేడు ఆ బాబాయ్ ఆత్మకి శాంతి కలగకుండా నేరస్థులను కాపాడుతున్నారంటూ మండిపడుతున్న వివేకా కుటుంబసభ్యులు

ఇంటి గుట్టు ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కూడా తెలిసిపోయింది. అధికారంలో ఉన్న‌వారు సొంత బాబాయ్‌ని కూడా చంపేందుకు వెనుకాడ‌రు అని తెలిసి భ‌యాందోళ‌న‌కు గుర‌య్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. వివేకానంద రెడ్డిని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి క‌లిసి హ‌త్య చేయించార‌ని అప్రూవ‌ర్‌గా మారిన నిందితుడు ద‌స్త‌గిరి మీడియా ముందు బ‌ల్ల గుద్ది మ‌రీ చెప్తున్నాడు.

ద‌స్త‌గిరి విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే.. సొంత బాబాయ్‌ని తాను ప్లాన్ చేసి చంప‌క‌పోయి ఉంటే ఎందుకు అవినాష్ రెడ్డిని సీబీఐ ద‌ర్యాప్తు నుంచి జ‌గ‌న్ కాపాడుతున్నాడు? అనేది ప్ర‌శ్న‌. అసెంబ్లీలో సొంత బాబాయ్‌ని ఎందుకు చంపుకుంటాడు అధ్య‌క్షా? మ‌న చేత్తో మ‌న క‌న్నునే ఎందుకు పొడుచుకుంటాం? అని జ‌గ‌న్ భారీ డైలాగులు చెప్పారు. ఇలాంటి డైలాగులు చెప్ప‌డం వ‌ల్ల‌.. సీబీఐ ద‌ర్యాప్తును కోరి ఆ త‌ర్వాత కేసును సీబీఐ నుంచి వెన‌క్కి తీసుకోవ‌డం వ‌ల్ల జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై అనుమానాలు పెరిగిపోయాయి.  (YS Viveka Murder Case)

జ‌గ‌న్ ఎందుకు రాలేదు?

అయితే.. వైఎస్ వివేకానంద రెడ్డి చ‌నిపోయార‌ని జ‌గ‌న్‌కు ముందే తెలిసిన‌ప్పుడు.. ఆయ‌న పులివెందుల ఎందుకు రాలేదని.. వివేకానంద రెడ్డి స‌తీమ‌ణి సౌభాగ్య‌మ్మ ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ రాక‌పోవ‌డం వ‌ల్లే అత‌నిపై అనుమానం వచ్చేలా చేసాయ‌ని అన్నారు.

సాకులు.. అనుమానాలు

ఓప‌క్క వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీతా రెడ్డి ఐదేళ్ల నుంచి ఒంట‌రి పోరాటం చేస్తూనే ఉన్నారు. నిందితుల‌కు శిక్ష ప‌డే వ‌ర‌కు వ‌దిలిపెట్ట‌ను అని శ‌ప‌థం చేసారు. అధికారంలో అన్న జ‌గ‌న్ ఉండ‌గా త‌న‌కు వెంట‌నే న్యాయం జ‌రుగుతుందని భావించి జ‌గ‌న్‌ను క‌లిసి ప‌రిస్థితిని వివ‌రించారు. ఇందుకు జ‌గ‌న్ స‌హ‌క‌రించ‌క‌పోగా.. అవినాష్‌పై అనుమానంతో కేసులు వేస్తే అత‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేర‌తార‌ని అప్పుడు కేంద్రం నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తే ఏమీ చేయ‌లేమ‌ని న‌చ్చ‌జెప్పేందుకు య‌త్నించారు. ఈ సాకులు అనుమానాన్ని మ‌రింత పెంచాయి.

సునీత‌ను ఎలాగైనా ఆపాల‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, అవినాష్ రెడ్డి కుట్ర‌లు ప‌న్నిన‌ట్లు కూడా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వివేకానంద రెడ్డికి రెండో భార్య ఉంద‌ని.. ఆమెతో కుమారుడిని క‌న‌డంతో ఎక్క‌డ ఆస్తుల్లో వాటా ఇవ్వాల్సి వ‌స్తుందోన‌ని సునీతే తండ్రిని చంపించిన‌ట్లు వార్త‌లు రాయించారు. సునీత‌పై త‌ప్పుడు కేసులు పెట్టించారు.

సునీత త‌ర్వాతి అడుగు ఏంటి?

సునీత త‌న తండ్రిని చంపిన‌వారిని రాజ‌కీయంగానే ఎదుర్కోవాల‌ని అనుకుంటున్నారు. ఇందుకోసం త‌న అక్క వైఎస్ షర్మిళ‌, ప్ర‌జ‌ల సాయం తీసుకుంటున్నారు. ఈరోజు వివేకా ఐదో వ‌ర్ధంతి సంద‌ర్భంగా క‌డ‌ప‌లో ఆత్మీయ స‌మ్మేళ‌న కార్యక్ర‌మానికి పిలుపునిచ్చారు. ప్ర‌జ‌ల‌తో తాను ఎదుర్కొన్న స‌మ‌స్య‌లు త‌న అన్న‌లు పెడుతున్న ఇబ్బందుల గురించి చ‌ర్చించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో క‌డ‌ప నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయాలా లేదా త‌న త‌ల్లి సౌభాగ్య‌మ్మ చేత పోటీ చేయించాలా అనే నిర్ణ‌యంపై కూడా చ‌ర్చించ‌నున్నారు.