Jagan: 3 పెళ్లిళ్లు చేసుకోవడం మాకు రాదు
AP: వపన్ కళ్యాణ్లాగా (pawan kalyan) 3 పెళ్లిళ్లు చేసుకుని పెళ్లి అనే వ్యవస్థనే రోడ్డుమీదకు తీసుకురావడం తనకు రాదంటూ విమర్శలు చేసారు ఏపీ సీఎం జగన్ (jagan). కురుపంలో జరిగిన అమ్మ ఒడి పబ్లిక్ మీటింగ్లో జగన్ పాల్గొన్నారు. వారాహి యాత్ర ప్రచారాల్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. లారీ ఎక్కి ఊగిపోతూ మాట్లాడలేం బూతులు తిట్టలేం తొడలు కొట్టలేం మీసాలు మెలేయలేం పెళ్లిళ్లు చేసుకుని పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకు తీసుకురాలేం అవన్నీ ఆ ప్యాకేజ్ స్టార్కే పేటెంట్ అంటూ తీవ్రంగా విమర్శించారు. దత్తపుత్రుడిలా రౌడీలాగా నేను మీసాలు తిప్పలేను, దత్తపుత్రుడులా నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేను అన్నారు.