Telugu Desam Party: క‌ష్ట‌మేనా..!

AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు (ap elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ (telugu desam party)  క‌న్ఫ్యూజ‌న్‌లో పడిపోయింది. BJP, జ‌న‌సేన‌తో (janasena) TDP పొత్తు పెట్టుకోబోతోంద‌ని చంద్ర‌బాబు నాయుడు ఆల్మోస్ట్ క‌న్ఫామ్ చేసేసారు. అందుకే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, కేంద్ర‌మంత్రులు అమిత్ షా, జేపీ న‌డ్డాల‌తో స‌మావేశం కూడా అయ్యారు. అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. జ‌న‌సేన‌కు BJP స‌పోర్ట్ ఉంద‌ని NDA మీట్‌కు ఆహ్వానించిన‌ప్పుడే అర్థం అయిపోయింది. దాంతో ఇప్పుడు TDP ఒంటరి అయిపోయింది. చూడ‌బోతే ఒంట‌రిగా ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని అనుకుంటోందేమో.

పొత్తు (alliance) లేకుండా TDP 2004లో, 2019లో ఎన్నిక‌ల‌కు వెళ్లింది. 2004లో 36 సీట్లు రాగా, 2019లో 23 సీట్లు మాత్ర‌మే వచ్చాయి. ఈసారి జనసేన (janasena) TDPతో పొత్తు వ‌ద్దు అనుకుంటే ఆ 23 సీట్లు కూడా రావ‌డం క‌ష్ట‌మే అని తెలుస్తోంది. తెలుగు దేశం కార్యకర్తలు 100 సీట్లు గెలుస్తాం అంటున్నప్పటికీ, ఆ సంఖ్య వాస్తవానికి చాలా దూరంగానే ఉందని చెప్పాలి. పొత్తు లేకపోతే 40 కూడా దాటడం కష్టమే. ఈ విష‌యం చంద్ర‌బాబు చేయించుకున్న స‌ర్వేల్లోనే తేలింది.

చంద్ర‌బాబుకి (chandrababu naidu) వ‌య‌సు మీద‌పడుతోంది. అందుకే ఆయ‌న పాద‌యాత్ర చేయ‌కుండా త‌న కొడుకు నారా లోకేష్ (nara lokesh) చేత చేయిస్తున్నారు. ఈసారి ఎలాగైనా మ‌ళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని చంద్ర‌బాబు కృషి చేస్తున్నారు. ఇక పొత్తులు పెట్టుకోకుండా ఒంట‌రిగా పోరాటానికి దిగితే మాత్రం అధికారం మ‌ళ్లీ YSRCPకే వెళ్లే అవ‌కాశం ఉంది. అదే జ‌రిగితే మ‌రో ఐదేళ్ల పాటు YSRCP చేసే అవ‌మానాల‌ను ఎదుర్కోవాలి. ఇవ‌న్నీ ఆలోచించుకుని చంద్ర‌బాబు ఓ నిర్ణ‌యం తీసుకుంటే మంచిది అని అంటున్నారు రాజకీయ విశ్లేష‌కులు.