Janasena: BJP ఆశీస్సులు ఉన్నాయ్.. త్యాగం త‌ప్ప‌దు

Janasena: పొత్తులో భాగంగా కొన్ని త్యాగాలు త‌ప్ప‌వ‌ని అన్నారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (Pawan Kalyan). తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల‌పై భార‌తీయ జ‌న‌తా పార్టీ శుభాశ్శీసులు ఉన్నాయని వైసీపీ విముక్త రాష్ట్రమే ప్ర‌థ‌మ అజెండా అని తెలిపారు.

రాష్ట్ర భ‌విష్య‌త్తు కోసం ఏర్ప‌డిన పొత్త కోసం జ‌న‌సేన – తెలుగు దేశం పార్టీలు ఐక్య‌త‌గా ప‌ని చేయాల్సిన స‌మ‌యం ఇది. వైసీపీ రాక్ష‌స పాల‌న నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జ‌న‌సేన – తెలుగుదేశం పార్టీల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు స‌మ‌ష్టిగా ప‌ని చేయాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇరు పార్టీల ఓట్లు రెండు పార్టీల అభ్య‌ర్ధులు పోటీ చేసే చోట్ల ప‌క్కాగా బ‌దిలీ జ‌రగాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 6 కోట్ల ఆంధ్రుల భ‌విష్య‌త్తును ఆలోచించి, వైసీపీ విముక్త రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నాం.

పార్టీ ఉన్న‌తి కోసం నాకు తోడుగా నిల‌బ‌డిన ప్ర‌తి ఒక్క‌రినీ మ‌న‌సులో పెట్టుకుంటాను. గుర్తుంచుకుంటాను. రాష్ట్ర భ‌విష్య‌త్తు కోసం వైసీపీ పాల‌న‌ను పార‌దోల‌డానికి ఏర్ప‌రుచుకున్న పొత్తులో భాగంగా కొన్ని త్యాగాలు త‌ప్ప‌వు. పార్టీ కోసం నిరంత‌రం క‌ష్ట‌ప‌డిన ప్ర‌తి జ‌న‌సేన నాయ‌కుడు, జన సైనికులు, వీర మ‌హిళ‌ల క‌ష్టాల‌ను, పోరాటాన్ని గుర్తుంచుకుంటాను. వారికి వచ్చే ప్ర‌భుత్వంలో త‌గిన ప్రాధాన్యం క‌ల్పించే బాధ్య‌త‌ను తీసుకుంటాను. జ‌న‌సేన 24 సీట్ల‌లోనే పోటీ చేస్తోంద‌ని భావించ‌కండి. మూడు పార్ల‌మెంట్ సీట్ల ప‌రిధిలోని 21 స్థానాల ప‌రిధిలో ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పోటీ చేస్తున్నామ‌ని భావించాలి. వైసీపీ పాల‌న‌లో నాశ‌నం అయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేలా కూట‌మి ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంది. జ‌న‌సేన‌, తెలుగు దేశం పార్టీల పొత్తును ప్ర‌జ‌లు మ‌నస్ఫూర్తిగా ఆశీర్వ‌దించేందుకు సిద్ధంగా ఉన్నారు. 

ఆప‌లేని యుద్ధం ఇస్తాం.. సిద్ధంగా ఉండండి

సిద్ధం.. సిద్ధం అంటూ రోజూ వైసీపీ నాయ‌కుడు చావ‌కొడుతున్నాడు. సిద్ధంగా ఉండండి.. మీకు ఆప‌లేని యుద్ధం ఇవ్వ‌బోతున్నాం. రాష్ట్రంలోని ప్ర‌తి పేద‌వాడి త‌ర‌ఫున బ‌లంగా పోరాడే యుద్ధం ఇస్తాం. క‌చ్చితంగా పేద‌వాడి బ‌తుకుల‌ను బాగు చేసే విధంగా పోరాటం చేస్తాం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌న కూట‌మి గెల‌వ‌బోతోంది. దీనిలో సందేహం లేదు అని ప‌వ‌న్ ధీమా వ్య‌క్తం చేసారు. (Janasena)

ALSO READ: AP Elections: ఆ 24 సీట్ల‌లోనూ TDP మ‌నుషులేనా?

సంపూర్ణ స‌హ‌కారంతో వైసీపీ పాల‌న నుంచి రాష్ట్రానికి విముక్తి

ఈ సంద‌ర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని వైసీపీ కబంధ హ‌స్తాల నుంచి విముక్తం చేసేందుకు తెలుగుదేశం – జ‌న‌సేన పార్టీలు సంపూర్ణంగా స‌హ‌క‌రించుకుని ముందుకు వెళ్లాల్సిన స‌మ‌యం ఇది. రాజ‌కీయ స్వార్థం కోసం ఏర్ప‌డిన పొత్తు కాదు. రాష్ట్ర భ‌విష్య‌త్తు కోసం తీసుకున్న నిర్ణ‌యం ఇది. ప్ర‌జా వేదిక విధ్వంసంలోమొద‌లైన ఈ పాల‌న ప్ర‌జా జీవితాల‌ను విధ్వంసం చేసింది. ఇలాంటి ప‌రిపాల‌న‌కు స్వ‌స్తి ప‌ల‌కాల్సిన అవ‌స‌రం ప్ర‌జ‌ల‌కు ఉంది.

ప్ర‌క‌టించిన అభ్య‌ర్ధుల‌ను వివిధ ర‌కాల స‌ర్వేలు, నివేదిక‌లు త‌ర్వాత ప్ర‌జ‌లంద‌రి ఆమోదంతోనే ఎంపిక చేసాం. దాదాపు 1.1 కోట్ల మంది అభిప్రాయాల‌ను తీసుకున్నాం. ప్ర‌జ‌ల్లో ఈ ప్ర‌భుత్వం మీద తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. రాష్ట్రంలో స్వేచ్ఛ‌గా బ‌తికే పరిస్థితి లేదు. పత్రిక‌ల మీద దాడులు, అధికారుల‌పై బెదిరింపులు సర్వ సాధార‌ణం అయ్యాయి. నా రాజ‌కీయ జీవితంలో ఎన్న‌డూ లేనంత అరాచ‌క పాల‌న‌ను వైసీపీ పాల‌న‌లో చూసాను. ప్ర‌శ్నించే వారిపై క‌క్ష క‌ట్టి దాడులు చేస్తున్నారు. ప్ర‌జ‌ల ఆస్తుల‌ను దోచుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తు కోసం తీసుకున్న పొత్తుల వ‌ల్ల ఈసారి సీట్లు ఆశించిన ప్ర‌తి ఒక్క‌రికీ సీటు రాకపోవ‌చ్చు. వారికి త‌గిన విధంగా అండ‌గా నిలుస్తాం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ దుర్మార్గ పాల‌న‌ను పార‌దోలాలంటే ప్ర‌జ‌లంతా ఏక‌మై తిప్పికొట్టాలి అన్నారు.