Israel: వెతికి.. వేటాడి.. చంపుతాం… హ‌మాస్‌ ఇక కాస్కో..!

Israel: హ‌మాస్ అంతానికి కౌంట్‌డౌన్ మొద‌లైపోయింది. మూడు రోజుల సంధి త‌ర్వాత ఇజ్రాయెల్ గాజాపై మ‌ళ్లీ దాడులు మొద‌లుపెట్టింది. ఇక అల్లాట‌ప్పా ఆట‌లు కాకుండా కుంభ‌స్థ‌లాన్ని బ‌ద్ద‌లుకొట్టాల‌ని ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజమిన్ నేత‌న్యాహు (benjamin netanyahu) ఫిక్స్ అయ్యారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్‌తో (mossad) మంత‌నాలు జ‌రిపి ప్ర‌పంచంలో హ‌మాస్ (hamas) అనే పేరు విన‌ప‌డ‌కుండా ఆ సంస్థ‌కు చెందిన‌వారిని ఎలిమినేట్ చేయాల‌ని నేత‌న్యాహు మొస్సాద్‌కు ఆదేశాలు జారీ చేసారు.

ట‌ర్కీ, లెబాన‌న్, ఖ‌తార్‌లో హమాస్‌కు మంచి గ్రౌండ్ ఉంది. ముందు ఈ దేశాల్లో హ‌మాస్‌ను అంత‌మొందించేందుకు మంచి ప్లాన్ వేయాల‌ని నేత‌న్యాహు మొస్సాద్‌కు తెలిపారు. ఇప్పుడు మొస్సాద్ హిట్ లిస్ట్‌లో ఉన్న హ‌మాస్ లీడ‌ర్లు వీరే.

ఇస్మాయిల్ హ‌నియే

మాజీ పాలెస్తీనా ప్ర‌ధాని అయిన ఇస్మాయిల్ హ‌నియే 2017లో హ‌మాస్ పొలిటిక‌ల్ బ్యూరో అధినేత‌గా మారారు. 2006లో హ‌నియే పాలెస్తీనా ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడే విషంతో కూడిన లేఖ‌తో ఆయ‌న్ను చంపాల‌ని చూసారు. కానీ కుద‌ర‌లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న ఖ‌తార్‌లో కొన్నాళ్లు ట‌ర్కీలో కొన్నాళ్లు నివ‌సిస్తూ ఉంటారు.

మ‌హ‌మ్మ‌ద్ డైఫ్

హ‌మాస్ మిలిట‌రీ వింగ్ అయిన ఎజ్దీన్ అల్‌క‌స‌మ్ బ్రిగేడ్స్‌కు అధినేత‌గా ఉన్నారు. ఈ సంస్థ ఇజ్రాయెల్‌కు నెంబ‌ర్ వ‌న్ శ‌త్రువు. ఇప్ప‌టికే ఇజ్రాయెల్ ప్ర‌భుత్వం ఇత‌న్ని చంపేందుకు ఆరు సార్లు య‌త్నించి విఫ‌ల‌మైంది. ఈసారి త‌ప్పించుకునే ఛాన్స్ లేకుండా నేత‌న్యాహు ప్లాన్ చేస్తున్నారు.

యాహ్యా సిన్వార్

గాజా అధినేత‌గా 2017లో బాధ్య‌త‌లు తీసుకున్నారు సిన్వార్. 23 ఏళ్ల పాటు ఇజ్రాయెల్ జైల్లో శిక్ష అనుభ‌వించిన సిన్వార్ ఖైదీల మార్పిడి ప్ర‌క్రియ ద్వారా బ‌య‌ట‌పడ్డాడు. హ‌మాస్ చెర‌లో బందీలుగా ఉండి ఇటీవ‌ల సంధి నేప‌థ్యంలో విడుద‌లైన వారు తాము హ‌మాస్ ఆధీనంలో ఉన్న‌ప్పుడు అక్క‌డ సిన్వార్‌ని చూసామ‌ని ఇజ్రాయెల్ ఆర్మీకి తెలిపారు.

ఖ‌లీద్ మ‌ష‌ల్

2017 వ‌ర‌కు ఖ‌లీద్ హ‌మాస్ ఛైర్మ‌న్‌గా ఉన్నారు. ప్ర‌స్తుతం ఇత‌ను ఖ‌తార్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. 1997లో జోర్డాన్‌లో మొస్సాద్ ఏజెంట్లు ఖ‌లీద్‌ను వేసేద్దామ‌నుకున్నారు. ఇందుకోసం వారు కెన‌డాకు చెందిన ప‌ర్యాట‌కులుగా జోర్డాన్‌లో ఎంట‌ర్ అయ్యారు. ఖ‌లీద్ క‌న‌ప‌డ‌గానే విష‌పూరిత స్ప్రేను అత‌నిపై చ‌ల్లారు. దాంతో ఖ‌లీద్ కోమాలోకి వెళ్లాడు. మొసాద్ టీం దొరికిపోయింది. దాంతో అప్ప‌టి అమెరికా అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్ క‌ల‌గ‌జేసుకుని ఇరు దేశాలతో చ‌ర్చ‌లు జ‌రిపి మొస్సాద్ టీంను విడుద‌ల చేయించారు.

ఇదే న్యాయం కోరుకునేది

ఇజ్రాయెల్ డిఫెన్స్ మంత్రి యోవ్ గాలెంట్‌కు చెందిన టెల్ అవీవ్‌లోని ఆయ‌న కార్యాల‌యంలో హ‌మాస్‌కు చెందిన వంద‌ల నేత‌ల ఫోటోలు ఆయ‌న టేబుల్‌పై ప‌డి ఉన్నాయి. అరువు తెచ్చుకున్న స‌మ‌యంతోనే ఇంకా హ‌మాస్ బ‌తికి ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. నిజానికి హ‌మాస్‌కు చెందిన‌ ఒక్కొక్క‌రిని వెతికి ప‌ట్టుకుని చంప‌డ‌మే క‌రెక్ట్ అని న్యాయం కూడా కోరుకుంటోంద‌ని ఆయ‌న తెలిపారు.