Israel: మానవత్వమా తొక్కా.. మాకు నీతులు చెప్పొద్దు
ఇజ్రాయెల్‌పై (israel) మెరుపు దాడులకు పాల్పడిన పాలెస్తీనాకు (palestine) చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్..(hamas) ఇజ్రాయెల్‌కు చెందిన పౌరులను తమ ఆధీనంలో ఉంచుకుంది. దాంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు.. (benjamin netanyau) పాలెస్తీనాలోని గాజా ప్రాంతంలో నీటి, విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. దాంతో హమాస్ సంస్థ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న అకృత్యాల కారణంగా గాజాలోని అమాయక ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని స్థానికులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో నేతన్యాహు మండిపడ్డారు. “” మానవత్వం లేదు తొక్క లేదు మాకు నీతులు చెప్పొద్దు. మా ఇజ్రాయెల్ వాసులను విడిచిపెడితేనే నీరు, విద్యుత్ సరఫరా ఉంటుంది “” అని ధీటుగా సమాధానం ఇచ్చారు.