Israel: గాజాకు సాయం ద‌క్క‌నివ్వం

Israel Gaza war: ఇజ్రాయెల్‌పై (israel) దాడి చేసిన గాజాకు (gaza) చెందిన హ‌మాస్ (hamas) సంస్థ‌ను ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. గాజాపై ఇజ్రాయెల్ రాకెట్ల‌తో దాడులు చేయ‌డంతో వేలాది మంది అమాయ‌క ప్ర‌జ‌లు కూడా ప్రాణాలుకోల్పోయారు. దాంతో అక్క‌డి ప్ర‌జ‌ల‌ను గాజా వ‌దిలి వెళ్లిపోవాల‌ని ఆదేశాలు జారీ చేసారు. అయితే గాజా కోసం అని ఇండియా, అమెరికా అత్య‌వ‌స‌ర సాయం ప్ర‌క‌టించింది. గాజా బాధితుల కోసం కావాల్సిన సామాగ్రిని పంపించింది. అయితే ఈ సామాగ్రి గాజాకు చేర‌డంపై ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నేత‌న్యాహు (benjamin netanyahu) స్పందిస్తూ.. వాటిపై త‌మ నిఘా క‌చ్చితంగా ఉంటుంద‌ని.. గాజాకు సాయం ద‌క్క‌కుండా చేస్తామ‌ని అన్నారు. సాయం కోసం పంపిన సామాగ్రిలో గాజాలోని హ‌మాస్ ఉగ్ర‌వాదుల‌కు ఆయుధాలు కూడా స‌ర‌ఫ‌రా అయ్యే ప్ర‌మాదం ఉంద‌న్న నేప‌థ్యంలో నేత‌న్యాహు ఈ విధంగా మాట్లాడారు.  (israel gaza war)