ISKCON మోసపూరితం.. ఆవులను అమ్మేస్తుంది
BJP ఎంపీ మేనకా గాంధీ (menaka gandhi) ఇస్కాన్‌పై (iskcon) వివాదాస్పద సంచలన ఆరోపణలు చేసారు. ఇస్కాన్ అనేది మోసపూరిత సంస్థ అని.. ఆవులను దొంగతనంగా తరలించి మాంసం అమ్మేవారికి అక్రమంగా అమ్మేస్తోందని ఆరోపించారు. ఓసారి అనంతపురంలోని గోషాలకు వెళ్లాలని అక్కడ ఉన్న అన్ని ఆవులు పాలు ఇచ్చేవేనని కానీ ఒక్క దూడ కూడా లేదని తెలిపారు. దీని అర్థం వారు ఆ దూడులను అమ్మేసి పాలు ఇచ్చేవాటితో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.
మాంసం కొట్టువారికి ఇస్కాన్ అమ్మినన్ని ఆవులను మరెవ్వరూ అమ్మలేదని.. పైకి మాత్రం శ్రీకృష్ణుడి పేరుతో హరే రామ హరే కృష్ణ అని ఎగురుతూ ఉంటారని అన్నారు. ఈ ఆరోపణలపై ఇస్కాన్ జాతీయ ప్రతినిధి యుధిష్టిర్ గోవింద దాస్ స్పందించారు. తమ వద్ద ఉన్న ఆవులు, గేదెలను జీవితాంతం దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటామని.. ఒక్క ఆవును కానీ గేదెను కానీ అమ్మేసిన దాఖలాలు లేవని అన్నారు.