Lok Sabha Elections: పద్మ విభూషణ్ ఇచ్చి ఓట్లు కొట్టేద్దామనా..?
Lok Sabha Elections: మెగాస్టార్ చిరంజీవికి (chiranjeevi) ఇటీవల పద్మవిభూషణ్‌ను (padma vibhushan) ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అయితే గత రెండేళ్లలో ప్రకటించకుండా సరిగ్గా లోక్ సభ ఎన్నికల ముందే ప్రకటించడంతో అవార్డు ప్రకటనపై కొన్ని చర్చలు మొదలయ్యాయి. BJPకి తెలుగు రాష్ట్రాల్లో సత్తా లేదు. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో విఫలమైపోయింది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై (ap elections) ఫోకస్ చేసింది. ఈ సమయంలో లోక్ సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్‌కి చెందిన అగ్రగాములకు పద్మ అవార్డులు ప్రకటిస్తే ఆ ప్రకారంగానైనా తెలుగువారి ఓట్లు తమకు పడతాయని BJP ప్లాన్ వేసిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే 2022లో దర్శకుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు BJP రాజ్యసభ ఎంపీ టికెట్ ఇచ్చింది. గత కొన్నేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) చిరంజీవిపై కాస్త స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల అయోధ్య రామమందిరంలో జరిగిన రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా టాలీవుడ్‌కి చెందిన టాప్ సెలబ్రిటీలను ఆహ్వానించారు.
అందులోచిరంజీవి, రామ్ చరణ్ ఉన్నారు. వీరంతా కుటుంబ సమేతంగా వేడుకకు వెళ్లి వచ్చారు. ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించడం.. అందులో చిరంజీవి పేరు ఉండటం రాజకీయ చర్చకు దారితీస్తోంది. చిరుకి అవార్డు ఇవ్వడంలో ఏమాత్రం తప్పు లేదు. కాకపోతే ఇంత ఆలస్యంగానా? అనే చర్చ జరుగుతోంది.